Virat Kohli: ఐపీఎల్ లో ఒక ఆసక్తికర రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీ

Kohli scores 3000 runs in a single venue
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో ఒక ఆసక్తికర రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఒకే వేదికపై 3 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా రికార్డును సొంతం చేసుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ మరో హాఫ్ సెంచరీని సాధించాడు. 37 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 92 ఇన్నింగ్స్ లలో 3,015 రన్స్ నమోదు చేశాడు. తద్వారా ఒకే వేదికపై 3 వేలకు పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. 

మరోవైపు కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఆర్సీబీ ఓటమి పాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 200 పరుగులు చేయగా... లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. 21 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమిపాలయింది.
Go Back to Shorts
Virat Kohli
IPL

More Telugu News