YS Avinash Reddy: దస్తగిరి మొదటి వాంగ్మూలంలో లేని అవినాశ్, భాస్కర రెడ్డి పేర్లు ఆ తర్వాత వాంగ్మూలంలో ఎందుకు వచ్చాయి?: కోర్టులో అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు

Arguments on Avinash Reddy bail petition in TS high court
  • వివేకా హత్య కేసులో దస్తగిరే హంతకుడన్న అవినాశ్ న్యాయవాది 
  • అతని వాంగ్మూలం పరిగణలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్న 
  • అరెస్ట్ అయినప్పుడు అవినాశ్, భాస్కర రెడ్డి పేర్లు చెప్పలేదని వాదనలు
  • రెండో వాంగ్మూలంలో వీరు పేర్లు ఎలా వచ్చాయన్న అవినాశ్ న్యాయవాది 
కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు వాదనలు ప్రారంభమయ్యాయి. అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. దస్తగిరి వాంగ్మూలాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరే హంతకుడు అన్నారు. వివేకా హత్యలో దస్తగిరి స్వయంగా పాల్గొన్నారని చెప్పారు. అలాగే, అతను అరెస్ట్ అయినప్పుడు ఈ హత్య కేసులో ఐదుగురు ఉన్నారని చెప్పాడని తెలిపారు. ఆ తర్వాత సీబీఐ మరో స్టేట్మెంట్ తీసుకుందని కోర్టుకు తెలిపారు. అందులో అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర రెడ్డి పేర్లు చెప్పారన్నారు.

దస్తగిరి మొదటి వాంగ్మూలంలో లేని అవినాశ్, భాస్కర రెడ్డి పేర్లు ఆ తర్వాత వాంగ్మూలంలో ఎందుకు వచ్చాయన్నారు. ఆ తర్వాత దస్తగిరి ముందస్తు బెయిల్ దాఖలు చేసుకుంటే సీబీఐ వ్యతిరేకించలేదని అవినాశ్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. యాంటిసిపేటరీ బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదన్నారు. హియర్ అండ్ సే ఎవిడెన్స్ ను బట్టే ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ ఇది ఎప్పుడూ ఎవిడెన్స్ కాదన్నారు. అవినాశ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సీబీఐ దర్యాఫ్తు చేస్తోందన్నారు. గూగుల్ టేకౌట్ ఎలా ఆధారమవుతుందన్నారు.

అవినాశ్ రెడ్డి జమ్మలమడుగు ప్రచారానికి వెళ్తుండగా వివేకా చనిపోయాడని ఆయన అల్లుడి తమ్ముడు సమాచారం ఇచ్చారన్నారు. అవినాశ్ తరఫు లాయర్లు ప్రధానంగా పై నాలుగు వాదనలు వినిపించారు. కాగా, వైఎస్ సునీత తరఫున లాయర్ లూథ్రా వాదనలు వినిపించాల్సి ఉంది.
YS Avinash Reddy
YS Vivekananda Reddy

More Telugu News