Vijayasai Reddy: విద్యార్థులు ఇక పబ్లిషర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడనక్కర్లేదు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy responds after govt released text books PDF copies in online
  • పీడీఎఫ్ రూపంలో టెక్ట్స్ బుక్స్ విడుదల చేసిన సర్కారు
  • 1 నుంచి 10వ తరగతి బుక్స్ ఇక ఆన్ లైన్ లో
  • ఇదొక చారిత్రాత్మక చర్య అని పేర్కొన్న విజయసాయి
ఏపీ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్ లో ఉంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యా సంస్కరణల్లో భాగంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టెక్ట్స్ బుక్ లు లేకపోయినా, ఈ పీడీఎఫ్ ప్రతులను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పాఠ్యాంశాలను చదువుకోవచ్చు. 

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉపయోగించే 353 టెక్ట్స్ పుస్తకాల సాఫ్ట్ కాపీలను ప్రభుత్వం ఆన్ లైన్ లో విడుదల చేసిందని వెల్లడించారు. ఇదొక చారిత్రాత్మక చర్య అని కొనియాడారు. 

విద్యార్థులు సులువుగా ఈ పాఠ్యపుస్తకాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, కోర్సు మెటీరియల్స్ చదువుకోవచ్చని విజయసాయి వివరించారు. ఇకపై టెక్ట్స్ పుస్తకాల కోసం పబ్లిషర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
Vijayasai Reddy
Text Books
Govt
Onlibe
PDF
YSRCP
Andhra Pradesh

More Telugu News