students: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీ యువకుల మృతి

Two students from Hyderabad killed in US car trailer smash
  • ట్రాక్టర్ పైకి దూసుకుపోయిన కారు
  • ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తుల ప్రయాణం
  • ఇద్దరి మృతి.. గాయాలతో బయటపడిన మరో వ్యక్తి
అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యవకులు దుర్మరణం పాలయ్యారు. ఈ నెల 24న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాన్స్ బర్గ్ హైవేపై వెళుతున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకుపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లిక్ గ్రీక్ రోడ్డు, అన్నా ప్రాంతంలో ఇది జరిగింది. పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఇంకా విడుదల చేయలేదు.

షికాగోలో నివసించే హైదరాబాద్ కు చెందిన మిన్ హాజ్ అక్తర్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారిని మహమ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్ గా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తి సయ్యద్ ఫైసల్ ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఉన్నత విద్య కోసం ఈ ముగ్గురు విద్యార్థులు అమెరికాకు వెళ్లగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ హైదరాబాద్ వ్యక్తి సహకారంతో మృతదేహాలను 25న సమాధి చేసినట్టు సామాజిక కార్యకర్త, అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు.
students
Hyderabad
killed
USA
road accident

More Telugu News