సఫారీ రైడ్ కు వెళితే వెంటపడ్డ పులి.. వీడియో ఇదిగో!
- ఒక్కసారిగా గాండ్రిస్తూ పరుగెత్తుకొచ్చిన వ్యాఘ్రం
- భయంతో కేకలు వేసిన పర్యాటకులు
- చాకచక్యంగా జీప్ ను ముందుకు తీసుకెళ్లిన డ్రైవర్
- వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టిన ఓ పర్యాటకుడు
పార్క్ లో సఫారీ రైడ్ కు వెళ్లిన పర్యాటక బృందానికి ఓ చోట పొదల్లో పెద్ద పులి కనిపించింది. దీంతో సఫారీ జీప్ డ్రైవర్ కాసేపు వాహనాన్ని నిలిపేశాడు. టూరిస్టులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇదంతా చూసి పులికి మండిపోయినట్టుంది.. ఒక్కసారిగా గాండ్రిస్తూ జీప్ వైపు పరిగెత్తుకొచ్చింది. అప్పటిదాకా పులిని చూస్తూ ఎంజాయ్ చేసిన పర్యాటకులకు పులి గాండ్రింపుతో గుండెలు జలదరించాయి. భయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు. అప్రమత్తమైన డ్రైవర్.. చాకచక్యంగా అక్కడి నుంచి జీప్ ను నెమ్మదిగా కదిలించాడు. జీప్ వెళ్లిపోతుండడం చూసి పులి కూడా నెమ్మదించి వెనుదిరిగింది.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ ‘వేళాపాళా లేకుండా అదేదో వాళ్ల హక్కులాగా జనం మీ ఇంట్లోకి వస్తూపోతుంటే మీరేం చేస్తారు?’ అంటూ కామెంట్ చేశారు. పర్యాటకుల గోలతో ఆ పులికి విసిగిపోయినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు.