Sai Dharam Tej: విరూపాక్ష సీక్వెల్ పై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ!

sai dharam tej clarifies about virupaksha sequel
  • ‘విరూపాక్ష’తో చాలా ఏళ్ల తర్వాత మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్
  • పార్ట్ 2 ఉంటుందా? అని ట్విట్టర్ లో అడిగిన అభిమాని
  • సీక్వెల్  ఉంటుందని బదులిచ్చిన సుప్రీం హీరో
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా ఏళ్ల తర్వాత ‘విరూపాక్ష’తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. తొలి రోజు నుంచే అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుండటంతో బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా కోట్లు కొల్లగొడుతోంది. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతునే ఉన్నాయి. కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరింది విరూపాక్ష. 

ఇదిలా ఉంటే.. విరూపాక్షకు సీక్వెల్‌ ఉంటుందా? అనే ప్రశ్న అప్పుడే మొదలైంది. సినిమా ఎండ్‌ కార్డ్స్‌ పడే ముందు సాయిధరమ్‌ తేజ్‌ కళ్లను చూపించడమే ఇందుకు కారణం. సెకండ్‌ పార్ట్‌పై మేకర్స్ హింట్‌ ఇచ్చినట్లుగా అనిపించింది. దీనిపై సాయి ధరమ్ తేజ్‌ స్పందించాడు.

నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల దాకా ట్విట్టర్ లో ‘ఆస్క్ఎస్ డీటీ’ పేరుతో సెషన్ నిర్వహించాడు తేజ్. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 

‘‘విరూపాక్ష మూవీ క్లైమాక్స్‌లో చిన్న హింట్ ఇచ్చారు. పార్ట్2 ఉంటుందా అన్నా. ఒకవేళ పార్ట్2 ఉంటే మన ఫ్యాన్స్‌కు పండగే అన్నా’’ అంటూ ఓ అభిమాని అడిగాడు. దానికి స్పందించిన సాయి తేజ్‌.. ‘‘ఉందనే కదా హింట్‌ ఇచ్చాం’’ అని రిప్లై ఇచ్చాడు. దాంతో విరూపాక్షకు సీక్వెల్‌ ఉంటుందని తేజ్‌ స్పష్టం చేశాడు.

More Telugu News

Sai Dharam Tej
virupaksha
virupaksha sequel
Supreme Hero