ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం.. తలుపు కొట్టి మరీ కాల్పులు.. ఇదిగో వీడియో!

Masked Men Knock On Home and Then Opens Fire
  • ఢిల్లీ సిద్ధార్థ్ నగర్ లో అపార్ట్ మెంట్ లోకి చొరబడిన ఇద్దరు దుండగులు
  • మాస్క్ వేసుకుని.. ఇంటి డోర్ కొట్టిన ఓ వ్యక్తి
  • తలుపు తీయకపోవడంతో రెండు సార్లు ఫైరింగ్
  • మరో ఇంటి కిటికీపై మూడు రౌండ్ల కాల్పులు
ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడిన దుండగులు.. రెండు ఇళ్లపై కాల్పులు జరిపారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ వీడియోల్లో రికార్డయ్యాయి.

ఆదివారం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని సిద్ధార్థ్ నగర్ లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను చూస్తే.. ఓ అపార్ట్ మెంట్ లోకి ఇద్దరు దుండగులు మాస్క్ లు వేసుకుని వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లోని ఇంటి తలుపులు కొట్టారు. రెండు మూడు సార్లు కొట్టినప్పటికీ తలుపులు తీయకపోవడంతో.. ఇద్దరూ మెట్లు దిగారు. ఓ వ్యక్తి తన వద్ద దాచుకున్న గన్ తీసి.. తలుపులపై రెండు రౌండ్ల కాల్పులపై జరిపాడు. ఆ ఇల్లు సొహైల్ సిద్దిఖీ అనే హిప్నోథెరపిస్ట్ ది అని పోలీసులు తెలిపారు. 

‘‘తర్వాత ఇద్దరూ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్లారు. అక్కడ మరో ఇంటి వద్దకు వెళ్లి.. కిటికీని టార్గెట్ గా చేసుకుని మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు’’ అని పోలీసులు వివరించారు.  ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
Delhi
apartment
masked men
Opens Fire

More Telugu News