చర్లపల్లి జైలు నుండి తీన్మార్ మల్లన్న విడుదల, కొత్త పార్టీ ప్రకటన
- తెలంగాణ నిర్మాణ పార్టీ పేరు రిజిస్టర్
- మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ
- వీకర్ సెక్షన్ ను నమ్ముకొని ఉన్నానని వ్యాఖ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్ముకొని తనలాంటి వారిని అరెస్ట్ చేయించాడని, కాని తాను వీకర్ సెక్షన్ ను నమ్ముకొని ముందుకు సాగుతున్నానని చెప్పారు. అర్హత లేని వారు కూడా మంత్రులుగా కొనసాగుతున్న కేబినెట్ ఇదే అని విమర్శలు గుప్పించారు.
గత నెలలో అరెస్టైన తీన్మార్ మల్లన్నకు మల్కాజిగిరి కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల్ నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.20వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.