Karnataka pride: ‘నందిని’.. కర్ణాటకకు గర్వకారణం: రాహుల్ గాంధీ

Karnatakas pride Rahul Gandhi relishes Nandini ice cream amid row over Amuls entry
  • కర్ణాటక రాష్ట్ర పాల ఉత్పత్తుల బ్రాండ్ కు రాహుల్ మద్దతు
  • అత్యుత్తమమైనది అంటూ ప్రశంస
  • బెంగళూరులోని ఓ పార్లర్ లో ఐస్ క్రీమ్ రుచి చూసిన రాహుల్
కర్ణాటక రాష్ట్రంలోకి ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ ప్రవేశాన్ని అక్కడి రైతులు, రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారికి మద్దతుగా వ్యాఖ్యానించారు. గుజరాత్ కు చెందిన అమూల్ రాకతో నందిని ఉత్పత్తుల విక్రయాలు దెబ్బతింటాయన్న ఆందోళన అక్కడి రైతులలో వ్యక్తమవుతోంది. 

ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఫ్లాగ్ షిఫ్ బ్రాండ్ ను అత్యుత్తమమైనదంటూ అభివర్ణించారు. నందిని బ్రాండ్ పై విక్రయిస్తున్న ఐస్ క్రీమ్ ఉత్పత్తులను రుచి చూశారు. బెంగళూరులోని జేపీ నగర్ లో నందిని మిల్క్ పార్లర్ వద్ద ఇది చోటు చేసుకుంది. ఆయన వెంట కర్ణాటక రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ‘కర్ణాటకకు గర్వకారణం -  నందిని అత్యుత్తమం’’అంటూ ట్వీట్ పెట్టారు.
Karnataka pride
Rahul Gandhi
Nandini ice cream
Amuls entry

More Telugu News