mercedes car: ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు

Malaysian Couple Gift Five Year old Daughter Mercedes car to motivate her to go to school
  • స్కూలుకు వెళ్లాలంటే కారు కొనివ్వాలని మారాం చేసిన బాలిక
  • కూతురు కోరిక తీర్చిన మలేసియా పేరెంట్స్ పై నెటిజన్ల విమర్శలు
  • పిల్లలు అడిగినవన్నీ కొనిచ్చి వారిని చెడగొట్టొద్దని సలహా
స్కూల్ కు వెళ్లనని మారాం చేస్తున్న ఐదేళ్ల కూతుర్ని బుజ్జగించేందుకు ఏకంగా ఓ బెంజ్ కారునే కొనిచ్చారా తల్లిదండ్రులు. కోట్లు ఖరీదు చేసే కారును గిఫ్ట్ గా అందుకున్న ఆ కూతురు ఇప్పుడు క్రమం తప్పకుండా స్కూలుకు వెళుతోందట. మలేసియాలో జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐదేళ్ల చిన్నారికి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడమేంటని, ఇది పిల్లలను చెడగొట్టడమేనని విమర్శిస్తున్నారు.

మలేసియాకు చెందిన పారిశ్రామికవేత్త ఫర్హానా జహ్రాకు ఒక్కతే కూతురు.. పేరు ఫాతిమా, వయసు ఐదేళ్లు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఫాతిమా కొన్నిరోజులు స్కూలు మానేసింది. ఆరోగ్యం బాగుపడ్డాక తిరిగి స్కూలుకు వెళ్లనంటూ మారాం చేసింది. దీంతో కూతురును స్కూలుకు పంపేందుకు ఓ మంచి బహుమతి ఇవ్వాలని ఫర్హానా భావించారు. ఫాతిమా పుట్టిన రోజు సమీపిస్తుండడంతో ఏం గిఫ్ట్ కావాలని అడగగా.. బీఎండబ్ల్యూ లేదా మెర్సిడెస్ జి వ్యాగన్ కావాలని ఫాతిమా అడిగింది.

ఆ కారు కొనిస్తే రోజూ స్కూలుకు వెళతానని ఫాతిమా చెప్పడంతో ఫర్హానా కూడా ఒప్పుకున్నారు. అన్నట్లుగానే ఫాతిమాకు మెర్సిడెస్ బెంజ్ కారును పుట్టిన రోజు బహుమతిగా కొనిచ్చారు. ఈ విషయం లోకల్ మీడియాకు చెప్పడం, వారు పబ్లిష్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఫాతిమాను అభినందిస్తూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం ఫర్హానా తీరును తప్పుబడుతున్నారు. ఐదేళ్ల పాప అడిగిందని బెంజ్ కారు కొనివ్వడమేంటని విమర్శిస్తున్నారు. డబ్బుకు కొదవలేదని పిల్లలు అడిగిందల్లా కొనిచ్చి వారిని చెడగొట్టొద్దని సలహా ఇస్తున్నారు.
mercedes car
malaysia
school
five years old girl

More Telugu News