Upasana: ప్రెగ్నెన్సీ వేడుకగా ఉండాలి.. ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా: ఉపాసన

upasana reveals about how she looks fit into normal clothes even in pregnancy
  • ప్రెగ్నెన్సీని రీడిఫైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్న ఉపాసన
  • ప్రపంచ దేశాలను ఏ ఇబ్బంది లేకుండా చుట్టేస్తున్నానని వెల్లడి 
  • ఇలా కనిపించడాన్ని గొప్పగా భావిస్తున్నానని వ్యాఖ్య
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ పీరియడ్ ను ఆస్వాదిస్తున్న ఉపాసన.. ‘మెటర్నిటీ స్టైల్’ కొనసాగిస్తున్నారు. నిజానికి మహిళలు ప్రెగ్నెన్సీ టైమ్‌లో తమ ప్రొఫెషనల్‌ లైఫ్‌కు కొన్నాళ్లు గ్యాప్ ఇస్తారు. వీలైనంత వరకు ప్రయాణాలు కూడా తగ్గించుకుంటారు. దూర ప్రయాణాలు అస్సలు పెట్టుకోరు. వీలైనంత వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ విషయంలో ఉపాసన వినూత్నంగా ఆలోచిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన పలు విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘ప్రెగ్నెన్సీ అనేది వేడుకగా ఉండాలని నేను భావిస్తున్నా. ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. అందుకే ప్రపంచ దేశాలను ఏ ఇబ్బంది లేకుండా చుట్టేస్తూ ప్రెగ్నెన్సీని నాకు నేను రీడిఫైన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని వివరించారు. 

‘‘ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను. పోషకాహారం ఎంత తీసుకుంటున్నాననే విషయాలతో పాటు నా గురించి ఆలోచించాలని డాక్టర్ చెప్పారు. దీంతో నార్మల్ దుస్తుల్లోనే ఫిట్‌గా కనిపిస్తున్నాను. అందుకే మెటర్నిటీ క్లాత్స్ ధరించడం లేదు. ఇలా కనిపించడాన్ని నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. నిజానికి ఇదొక గొప్ప ప్రయాణం’’ అని చెప్పుకొచ్చారు. దుస్తులను శరీరానికి తగినట్లుగా, జువెలరీని తన మూడ్‌కు అనుగుణంగా ధరిస్తానని ఉపాసన చెప్పారు. కశ్మీర్, స్వీడన్ నుంచి వచ్చిన వాటిని ధరించడం తనకు ఇష్టమని తెలిపారు.
Upasana
Ramcharan
Maternity Clothes
Maternity style

More Telugu News