Narendra Modi: మోదీపై అమెరికా మంత్రి పొగడ్తలు..వీడియో వైరల్

US secretary of commerce showers praises on PM narendra modi
షార్ట్స్‌లో చూడండి
అమెరికా వాణిజ్య శాఖ మంత్రి జీనా రైమాండో భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడంటూ ఆకాశానికెత్తేశారు. న్యూఢిల్లీలోని ఇండియా హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి తన భారత పర్యటన గురించి ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారింది. 

‘‘ఈ మధ్య నేను ఇండియాకు వచ్చి వెళ్లాను. హోలీ వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఓ రోజు ముందుగానే భారత్‌లో దిగాను. ఆ సమయంలో మోదీతో సమావేశమయ్యే అద్భుత అవకాశం దక్కింది. ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడు, ప్రజలపై ఆయనకున్న నిబద్ధత మాటల్లో వర్ణించలేం. ప్రజలను పేదరికం నుంచి బయటపడేయాలని, భారత్‌ను ఓ ప్రపంచశక్తిగా ముందుకు నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇది వాస్తవరూపం దాలుస్తోంది’’ అని ఆమె ప్రసంగించారు. కాగా.. భారత్, అమెరికా మధ్య బలపడుతున్న దౌత్యబంధానికి అమెరికా మంత్రి వ్యాఖ్యలు ఓ సంకేతమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Narendra Modi

More Telugu News