Japan: జపాన్ ప్రధాని క్షేమంగా ఉన్నారని తెలిసి మనసు కుదుటపడింది..ప్రధాని మోదీ వ్యాఖ్య

PM modi condems attack on japan prime minister
షార్ట్స్‌లో చూడండి
జపాన్ ప్రధాని కిషిదాపై స్మోక్ బాంబు దాడిని ఖండిస్తున్నట్టు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పేర్కొన్నారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసి తన మనసు కుదుటపడినట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

జపాన్ ప్రధాని కిషిదాపై శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. తీర ప్రాంతనగరమైన వకయామాలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కిషిదా ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడి నుంచి ప్రధాని క్షేమంగా బయటపడ్డారు. స్మోక్ బాంబు కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగకమ్ముకోవడంతో కార్యక్రమానికి వచ్చిన వారందరూ తీవ్ర భయాందోళనలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని అటూఇటూ పరుగులు తీశారు. అక్కడే ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Japan
India
Narendra Modi

More Telugu News