స్మోక్ బాంబుతో జపాన్ ప్రధానిపై దాడి!
- వకయామాలో ప్రధాని ప్రసంగించడానికి ముందు స్మోక్ బాంబు పేలుడు
- కిషడాను సురక్షితంగా అక్కడి నుంచి తరలించిన భద్రతా సిబ్బంది
- వకయామా నంబర్-1 జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని
అది పెద్ద శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వకయామాలోని ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన తర్వాత ఆయన ప్రసంగించడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. వకయామా నంబర్-1 జిల్లాలో ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రసంగించాల్సి ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. పేలుడు నేపథ్యంలో ప్రధాని కిషిడా ప్రసంగం రద్దయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.