ట్విట్టర్ లో పోస్టుల ద్వారా యూజర్లు డబ్బులు సంపాదించుకునే అవకాశం
- ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో యూజర్ల పోస్టులకు డబ్బులు
- కంటెంట్ క్రియేటర్లకు ద్వారాలు తెరుస్తున్న ట్విట్టర్
- మస్క్ చేతికి వెళ్లాక ట్విట్టర్ లో మార్పులు
- మానిటైజేషన్ ప్రోగ్రామ్ కు రూపకల్పన
- ప్రస్తుతానికి అమెరికాలో అమలు.. త్వరలో ఇతర దేశాలకు వర్తింపు
అందులో భాగంగానే మానిటైజేషన్ ఆప్షన్ తీసుకువచ్చినట్టు మస్క్ వెల్లడించారు. భారీ టెక్ట్స్ కంటెంట్, ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు సహా తమ కంటెంట్ పై యూజర్లు సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకోవచ్చని, తద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని వివరించారు. ట్విట్టర్ ఓపెన్ చేశాక సెట్టింగ్స్ లోకి వెళ్లి మానిటైజ్ అనే ఫీచర్ పై క్లిక్ చేస్తే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని మస్క్ తెలిపారు.
అయితే, ఈ మానిటైజేషన్ ఆప్షన్ ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులో ఉందని, త్వరలోనే మిగిలిన దేశాలకు కూడా వర్తింపజేస్తామని వెల్లడించారు. ఈ మానిటైజేషన్ ప్రోగ్రాం ద్వారా యూజర్లకు లభించే డబ్బులో 12 నెలల పాటు ట్విట్టర్ ఏమీ తీసుకోబోదని తెలిపారు. యూజర్లు ఎప్పుడు కావాలనుకున్నా తమ కంటెంట్ తో ట్విట్టర్ ను వీడవచ్చని మస్క్ స్పష్టం చేశారు.