Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 38 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 16 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పెరిగిన ఇండస్ బ్యాంక్ షేరు విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా తొమ్మిదో రోజు లాభాల్లో ముగిశాయి. ఎనిమిది రోజుల లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతల కారణంగా మధ్యాహ్నం సమయానికి మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. అయితే చివరి గంటలో మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 60,431కి చేరుకుంది. నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 17,828 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, రియాల్టీ సెక్టార్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:  
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.15%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.74%), యాక్సిస్ బ్యాంక్ (1.62%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.46%), కోటక్ బ్యాంక్ (1.41%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.79%), టెక్ మహీంద్రా (-2.13%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.09%), ఎన్టీపీసీ (-1.62%), టీసీఎస్ (-1.61%).    

More Telugu News