OTT: రేపు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే!

Number of cinemas and web series will release this Friday on OTT
  • ఒకే రోజు విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్ లు
  • ఓటీటీ వీక్షకులకు పండగ!
  • విభిన్న భాషలు, భిన్న జానర్లలో కంటెంట్
కరోనా సంక్షోభం కారణంగా థియేటర్లు మూతపడడంతో ఇదే అదనుగా ఓటీటీ రంగం విశేష ప్రజాదరణ పొందింది. కరోనా వ్యాప్తి తగ్గి థియేటర్లు మళ్లీ తెరుచుకున్నప్పటికీ, ప్రజలు హోం ఎంటర్టయిన్ మెంట్ కు పర్యాయపదంలా నిలుస్తున్న ఓటీటీలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందుకు తగినట్టుగానే భిన్న రకాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ వేదికలపై పసందైన కంటెంట్ లభ్యమవుతోంది. 

ఈ శుక్రవారం కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించేందుకు వస్తున్నాయి. రేపు (ఏప్రిల్ 14) ఒక్కరోజే వివిధ ఆన్ లైన్ స్ట్రీమింగ్ వేదికలపై మొత్తం 17 సినిమాలు/వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి.

ఆహా- ధాస్ కా ధమ్మీ (తెలుగు), మసూద (తమిళం)
అమెజాన్ ప్రైమ్- కబ్జ (సినిమా), జూబ్లీ (వెబ్ సిరీస్-తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం), ది మార్వలెస్ మిసెస్ మై సెల్ (వెబ్ సిరీస్ సీజన్-5 ఇంగ్లీష్)
జీ5- మిసెస్ అండర్ కవర్ (సినిమా-మలయాళం), ప్రోజాపోటీ (సినిమా-బెంగాలీ), ప్రణయ విలాసం (సినిమా-మలయాళం), మిత్రాన్  దా నా చల్దా (సినిమా-పంజాబీ)
డిస్నీ హాట్ స్టార్- ఓ కల (సినిమా-తెలుగు)
నెట్ ఫ్లిక్స్- ది లాస్ట్ కింగ్ డమ్ (సినిమా-ఇంగ్లీష్), క్వీన్ మేకర్ (వెబ్ సిరీస్ సీజన్ 1-కొరియన్), కన్నై నంబాతే (సినిమా-తమిళం), క్వీన్స్ ఆఫ్ ద రన్ (సినిమా-మెక్సికన్), ఫెనోమినా (సినిమా-స్పానిష్), వెదరింగ్ (సినిమా-ఇంగ్లీష్)
ఈటీవీ విన్- అసలు (సినిమా-తెలుగు)

OTT
Cinema
Web Series

More Telugu News