సుఖేశ్ తో నాకు పరిచయం లేదు: ఎమ్మెల్సీ కవిత వివరణ
- కేసీఆర్ ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కవిత
- కొందరు పాత్రికేయులు విలువలు పాటించడం లేదని మండిపాటు
- ఎవరీకీ తలవంచే పరిస్థితే లేదని వ్యాఖ్య
ఆర్థిక నేరగాడైన సుఖేశ్ చంద్రశేఖర్ తనను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేయడం, వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, ఆ తర్వాత బీజేపీ ఎంపీ అర్వింద్ బీజేపీ టూల్ కిట్ లో బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టడం ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని విమర్శించారు. సుఖేశ్ తో తనకు పరిచయం కూడా లేదని చెప్పారు. ఆయనతో తనకు సంబంధం లేదని తెలిపారు. పాత్రికేయులు కనీస విలువలను కూడా పాటించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ బిడ్డలం తల వంచమని, తెగించి కొట్లాడతామని చెప్పారు.