తెలంగాణలో నేడు, రేపు ఎండలు మండిపోతాయ్!
- ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 వరకు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిక
- ఉదయం 9 నుంచే భానుడి ప్రతాపం మొదలు
- అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారుల సూచన
పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల దాకా నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో పూర్తిగా ఇళ్లలోనే ఉండాలని, చల్లని పానీయాలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఆదిలాబాద్ లో బుధవారం 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, కనిష్ఠంగా మెదక్ లో 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.