టీఎస్ పీఎస్సీ సీడీపీవో, ఈవో పరీక్షలపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- ఈ పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన 76 మంది అభ్యర్థులు
- సోమవారం విచారణకు చేపట్టిన హైకోర్టు ధర్మాసనం
- వాదనలకు సమయం కావాలని కోరడంతో మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి
సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపైనా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు నిర్వహించిందని, తాము వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియను నిలిపేసేలా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని పిటిషన్ దారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తారని పిటిషనర్లు తెలిపారు. దీంతో విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.