Google Pay: గూగుల్ పే యూజర్లకు పొరపాటుగా రూ.80వేల చొప్పున క్రెడిట్

Google Pay accidentally gives up to Rs 80000 to some users here are the details
  • 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు జమ
  • సాంకేతిక లోపంతో ఎదురైన పరిణామం
  • సామాజికక మాధ్యమాల్లో వెల్లడించిన కొందరు యూజర్లు
గూగుల్ పే యూజర్లు కొందరు జాక్ పాట్ కొట్టేశారు! అదెలా అంటారా..? సాంకేతిక లోపంతో కొందరు గూగుల్ పే యూజర్లకు పది నుంచి వెయ్యి డాలర్ల మేర అదనంగా జమ అవుతున్న విషయం వెలుగు చూసింది. కొందరు సంతోషంగా వెంటనే కావాల్సినవి కొనుగోలు చేసుకోగా, కొందరు చూసి సంతోష పడిపోయారు. అయితే, జరిగిన తప్పిదాన్ని గూగుల్ గుర్తించి పొరపాటుగా జమ చేసిన మొత్తాన్ని మళ్లీ తిరిగి డెబిట్ చేసింది.

కాకపోతే అప్పటికే జమ అయిన మొత్తాన్ని ఖర్చు చేసిన వారి విషయంలో ఏమీ చేయలేకపోయింది. అలాంటి యూజర్ల విషయంలో తదుపరి ఎలాంటి చర్యలూ ఉండవని స్పష్టం చేసింది. గూగుల్ పేలో గ్లిచ్ విషయాన్ని జర్నలిస్ట్ మిషాల్ రెహమాన్ ట్విట్టర్ లో వెల్లడించారు. 

‘‘గూగుల్ పే ర్యాండమ్ గా యూజర్లకు ఉచితంగా డబ్బులు ఇస్తోంది. నేను ఇప్పుడే గూగుల్ పే తెరిచి చూశాను. 46 డాలర్లు రివార్డుగా జమ అయినట్టు కనిపించింది’’ అని ఆయన రాసుకొచ్చారు. ఎర్రర్ కారణంగా డబ్బు జమ అయిందని, ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నట్టు గూగుల్ పే నుంచి మెయిల్ కూడా వచ్చినట్టు వెల్లడించారు. గూగుల్ పే యాప్ తెరిచి రివార్డ్స్ ను ఓ సారి చెక్ చేసుకోండంటూ ఆయన సూచించారు. పలువురు ఇతర యూజర్లు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇదే విషయాన్ని పంచుకున్నారు.
Google Pay
technical glitch
error
money credit
credited
g pay accounts

More Telugu News