వెంట పడ్డ వీధి కుక్కలు.. కారును ఢీకొట్టిన స్కూటర్
- ఒడిశా రాష్ట్రం బెర్హంపూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఘటన
- కుక్కలు వెంటాడడంతో భయపడిపోయిన మహిళలు
- వాటిని చూస్తూ వేగంగా పోనీయడంతో అదుపు తప్పిన స్కూటర్
వీధి కుక్కలు వెంట పడగా, స్కూటర్ పై వెళుతున్న మహిళలు భయపడిపోయి నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ స్కూటర్ ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ ముందు భాగంలో కూర్చున్న బాలుడు, స్కూటర్ పై ఉన్న ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. గాయాలతో వారు బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత కుక్కుల గుంపు అక్కడి నుంచి పరారైంది. కుక్కలకు భయపడిపోకుండా వాహనాన్ని నిలిపివేసి, కిందకు దిగితే భయంతో అవే పారిపోతాయి. కానీ, చాలా మంది భయంతో వాహనాన్ని వేగంగా ముందుకు పోనిస్తుంటారు. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయని గ్రహించాలి.