Road Accident: హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తూ.. దెందులూరు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా

Private Bus Going To Vizianagaram From Hyderabad Overturns In Denduluru
  • ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు
  • గాయపడిన 11 మందిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • ప్రమాద కారణంపై పోలీసుల ఆరా
హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేటు బస్సు ఏలూరు జిల్లా దెందులూరు వద్ద ఈ తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు డ్రైవర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దెందులూరు, హైవే పెట్రోలింగ్ పోలీసులు బాధితులను అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు బోల్తా పడడానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.
Road Accident
Eluru
Andhra Pradesh
Hyderabad
Dunduluru

More Telugu News