ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు
- ప్రతీ రెండు, మూడు నిమిషాలకు ఓ మెట్రో రైలు
- మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు
సిటీ శివార్ల నుంచి ఉప్పల్ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. దీంతో సాయంత్రం వరకు ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.