ఉద్యోగులకు ‘ఉచితాలను’ నిలిపివేయనున్న గూగుల్
- పొదుపు మంత్రం పఠిస్తున్న గూగుల్
- ఉద్యోగులకు మైక్రో కిచెన్, ఫ్రీ లాండ్రీ తదితర సేవలను తొలగించేందుకు నిర్ణయం
- ఈ మేరకు ఉద్యోగులకు సీఎఫ్ఓ నుంచి నోటీసులు
- బిజినెస్ ఇన్‌సైడర్ కథనంలో వెల్లడి
ఖర్ఛులు తగ్గించుకునేందుకు పొదుపు మంత్రం పఠిస్తున్న గూగుల్ ఈ ఉచితాలన్నిటినీ తొలగించనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు ఓ నోటీసు అందినట్టు బిజినెస్ ఇన్‌సైడర్ పత్రిక కథనంలో వెల్లడైంది. ఈ నోటీసులను సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రుత్ పొరాట్ స్వయంగా పంపించారట. ఈ ‘ఉచితాలు’ తాలూకు నిధులను ఇతర ప్రాధాన్యాల వైపు మళ్లించడమే తమ లక్ష్యమని తన లేఖలో స్పష్టం చేశారట. అంతేకాకుండా.. కొత్త నియామకాలను కూడా తగ్గించామని, ప్రస్తుతమున్న ఉద్యోగులనే హై ప్రయారిటీ పనులకు వినియోగించుకుంటామని చెప్పుకొచ్చారట. గూగుల్ కార్యాలయం ఏ ప్రాంతంలో ఉందనే దాన్ని బట్టి ఉచితాలకు కోతలు విధించనున్నారని సమాచారం.