అమితాబ్ బచ్చన్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి
- ఆమ్వే లాంటి సంస్థలను ప్రోత్సహించొద్దంటూ సోషల్ మీడియాలో సజ్జనార్ వినతి
- దేశఆర్థిక వ్యవస్థను ఆ సంస్థలు నాశనం చేస్తున్నాయని ఆరోపణ
- అమితాబ్ సహా సెలబ్రిటీలను ఉద్దేశించి ట్వీట్
ఇక అమెరికాకు చెందిన ఆమ్వే కంపెనీ ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించి పలు ఉత్పత్తులను విక్రయిస్తుంటుంది. అయితే, ఆమ్వే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్‌కు పాల్పడుతోందని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది ఏప్రిల్‌లో ఆరోపించింది. సంస్థ అసలు లక్ష్యం ఉత్పత్తుల అమ్మకాలు కాదని, గొలుసుకట్టు స్కీముల్లో ప్రజలను చేర్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అప్పట్లో ఈడీ ఆమ్వేకు చెందిన సుమారు రూ.757 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది.