సెల్ ఫోన్ సృష్టికర్తకు సెల్ ఫోన్ వాడకం బాగారాదట!
- ఇతరులతో మాట్లాడడానికే సెల్ ఫోన్ ఎక్కువగా వాడతానంటున్న మార్టిన్ కూపర్
- 1973లో మొబైల్ ఫోన్ ను తయారుచేసిన కూపర్
- ఫస్ట్ కాల్ తన ప్రత్యర్థికే చేసినట్లు వివరించిన 94 ఏళ్ల ఇంజనీర్
ఈ సందర్భంగా కూపర్ మాట్లాడుతూ.. సెల్ ఫోన్ ఈ స్థాయిలో ప్రజల జీవితంతో పెనవేసుకుపోతుందని భావించలేదని చెప్పారు. అయితే, భవిష్యత్తులో వ్యాధులను జయించేందుకు కూడా సెల్ ఫోన్ ఉపయోగపడుతుందని కూపర్ చెప్పారు. సెల్ ఫోన్ వాడకం విషయంలో ఇప్పటికీ తనకు పూర్తి అవగాహన రాలేదని అన్నారు. తన మనవలు, మునిమనవలు వాడుతున్నట్లుగా సెల్ ఫోన్ ను తాను వాడలేనని చెప్పారు. తన దగ్గరున్న ఆపిల్ స్మార్ట్ ఫోన్ ను చూపిస్తూ.. ఫోన్ ను ఎక్కువగా ఇతరులతో మాట్లాడడానికే వాడుతుంటానని కూపర్ వివరించారు. కాగా, 1973లో మార్టిన్ కూపర్ నేతృత్వంలోని మోటరోలా ఇంజనీర్ల బృందం సెల్ ఫోన్ ను తయారుచేసింది. 1973 ఏప్రిల్ 3న మొదటి ఫోన్ కాల్ ను తన ప్రత్యర్థి, ది బెల్ సిస్టమ్ కంపెనీ ఇంజనీర్ డాక్టర్ జోయెల్ ఎంగెల్ కు చేసినట్లు కూపర్ తెలిపారు.