టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల 'ఇన్‌స్టా క్వీన్'!
- తిరువల్లూర్‌లో సోమవారం వెలుగు చూసిన ఘటన
- తండ్రి చదువుకోమన్నందుకు బాలిక ఆత్మహత్య
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
- ఇన్‌స్టా క్వీన్‌గా బాలిక పాప్యులర్
ఇదిలా ఉంటే.. సోమవారం బాలిక తన అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఇది గమనించిన తండ్రి..ఆటలు ఆపి వెళ్లి చదువుకోవాలని బాలికకు సూచించారు. తమ ఇంటి తాళాలు కూడా బాలికకు ఇచ్చి పంపించారు. ఆ తరువాత ఆయన తన బైక్ తీసుకుని పెట్రోల్ నింపుకునేందుకు వెళ్లారు.
రాత్రి 8.15 గంటలకు ఇంటికి వెళ్లిన ఆయన..తలుపులు కొట్టగా బాలిక ఎంతకీ స్పందించలేదు. దీంతో కంగారు పడిపోయిన కృష్ణమూర్తి తలుపులు పగలగొట్టి లోపలికెళ్లగా.. బాలిక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.