'గేమ్ చేంజర్'... రామ్ చరణ్, శంకర్ సినిమాకు అదిరిపోయే టైటిల్

  • శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రం
  • ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు
  • టైటిల్ ప్రకటించిన చిత్రబృందం
  • ఇవాళే ఫస్ట్ లుక్ కూడా విడుదల
Ram Charan new movie title is Game Changer

ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ15 చిత్రబృందం అసలుసిసలైన అప్ డేట్ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే టైటిల్ ను అనౌన్స్ చేసింది. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. 

టైటిల్ అదిరిపోయిందంటూ గ్లోబల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కోసం ఎప్పట్నించో ఎదురుచూస్తున్న అభిమానులకు రామ్ చరణ్ పుట్టినరోజున సరైన ట్రీట్ ఇచ్చినట్టయింది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. సౌత్ లో తిరుగులేని డైరెక్టర్ గా కొనసాగుతున్న శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'గేమ్ చేంజర్' పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు కూడా నటిస్తున్నారు.

రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని దర్శకుడు శంకర్ బలంగా నమ్ముతున్నారు. టైటిల్ ద్వారానే హీరో పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో శంకర్ తనదైన శైలిలో చెప్పేశాడు. 

'గేమ్ చేంజర్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా ఇవాళే విడుదల కానుంది.

More Telugu News