కొంటె చూపులతో కట్టి పడేస్తున్న బ్యూటీ .. బాంధవి లేటెస్ట్ పిక్స్!

  • 'మసూద'తో పరిచయమైన బాంధవి శ్రీధర్
  • గుంటూరు జిల్లా నుంచి పరిచయమైన బ్యూటీ 
  • గ్లామర్ తో మనసులను దోచేసిన భామ 
  • అవకాశాల కోసం గట్టిగానే జరుగుతున్న ప్రయత్నాలు

Bandhavi Sridhar Special

తెలుగు తెరపైకి దెయ్యం సినిమాలు చాలానే వచ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఆడియన్స్ ను భయపెట్టగలిగాయి. దెయ్యం సినిమాలు భయపెట్టాలంటే కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఆ పై దెయ్యం ఆవహించినవారు చేసే యాక్షన్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అలా దెయ్యం పట్టిన యువతి పాత్రలో 'మసూద'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువతి .. బాంధవి శ్రీధర్.బాంధవి శ్రీధర్ గుంటూరు జిల్లా నుంచి ఇండస్ట్రీకి వచ్చింది .. ఇదే ఆమెకి ఫస్టు మూవీ. ఈ సినిమా చూసి ఆడియన్స్ భయపడ్డారు .. కానీ ఈ బ్యూటీని చూసి మనసు పారేసుకున్నారు. విశాలమైన కళ్లతో .. చక్కని మేని ఛాయతో .. ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనసులను దోచేసింది. ఈ సినిమా చూసిన కుర్రాళ్లంతా పోలోమంటూ ఆమెను గురించి సెర్చ్ చేశారు. అందాల పోటీల్లో అమ్మడు చాలా ప్రైజులు గెలుచుకుందని తెలిసి షాక్ అయ్యారు. 'మసూద' తరువాత ఆమె ఎక్కడా కనిపించపోవడంతో, సినిమాలు చేసే ఉద్దేశం లేదని అనుకున్నారు. కానీ ఈ కలువ కళ్ల భామ అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేస్తోందని తెలుస్తోంది. ఆమె నుంచి వచ్చిన లేటెస్ట్ పిక్స్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. అందం .. అమాయకత్వం కలగలిసినట్టుగా కనిపించే ఈ సుందరి, ఎంతవరకూ అవకాశాలను వెతికి పట్టుకుంటుందనేది చూడాలి.

More Telugu News