Mumbai Indians: డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్: వారియర్స్ కు భారీ టార్గెట్ నిర్దేశించిన ముంబయి ఇండియన్స్

Mumbai Indians set UP Warriorz huge target in WPL Eliminator
షార్ట్స్‌లో చూడండి
భారత్ లో తొలిసారి నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. నాట్ షివర్ అద్భుతంగా ఆడి 38 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలచింది. షివర్ స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. చివర్లో మీలీ కెర్ 19 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసింది. 

హేలీ మాథ్యూస్ 26, యస్తికా భాటియా 21, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 14 పరుగులు చేశారు. వారియర్స్ జట్టు బౌలర్లలో సోఫీ ఎక్సెల్ స్టోన్ 2, అంజలి శ్రావణి 1, పర్శవి చోప్రా 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Mumbai Indians
UP Warriorz
Eliminator
WPL

More Telugu News