భారీ యాక్షన్ థ్రిల్లర్ గా ' గురుదేవ్ హోయిసల' .. ట్రైలర్ రిలీజ్!

  • ధనుంజయ్ హీరోగా ' గురుదేవ్ హోయిసల'
  • పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న హీరో 
  • కథానాయికగా కనిపించనున్న అమృత అయ్యర్ 
  • ఈ నెల 30వ తేదీన విడుదలవుతున్న సినిమా

Gurudev Hoysala trailer released

ఇటీవల కాలంలో కన్నడ సినిమాలు భారీతనాన్ని పెంచుకుంటూ వెళుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ తాలూకు సినిమాలలో ఈ భారీతనం ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి భారీతనాన్ని సంతరించుకున్న యాక్షన్ సినిమాల జాబితాలో తాజాగా 'గురుదేవ్ హోయిసల' ఒకటిగా కనిపిస్తోంది. 

ధనుంజయ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఆయన జోడీగా ఈ సినిమాలో అమృత అయ్యర్ అలరించనుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులు ముందు నిలబడాలి .. కానీ అలాంటి పోలీసులకు సమస్య వస్తే మాత్రం ఎవరూ పట్టించుకోరు' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది.

ఒక వైపున స్వార్థ రాజకీయాలు .. మరో వైపున వారికి మద్దతుగా నిలిచే అధికారులు .. ఇంకో వైపున అమాయక ప్రజలు .. వీరి మధ్య నలిగిపోయే నిజాయితీ పరులైన పోలీసులకి మధ్య నడిచే కథ ఇది. కార్తీక్ - యోగిరాజ్ నిర్మించిన ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News