ఐపీఎల్ కు కూడా ధోనీ గుడ్ బై?.. చాహర్ ఏమన్నాడంటే ?
- మరో రెండు సీజన్లు ఆడతారని భావిస్తున్నట్లు వెల్లడి
- ఐపీఎల్ నుంచి తప్పుకునే విషయంలో ధోని ఎలాంటి ప్రకటనా చేయలేదన్న పేసర్
- ధోనీతో కలిసి ఆడడం గొప్ప గౌరవం.. చాలామంది కలలు కంటుంటారన్న చాహర్
‘ధోనికి ఈ ఐపీఎల్ సీజనే చివరిదంటూ ఎవరూ ప్రకటించలేదు. ధోనీ కూడా ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరిన్ని సీజన్లలో ఆయన ఆడాలనే మేం కోరుకుంటున్నాం. ఎంతకాలం ఆడాలి, ఎప్పుడు తప్పుకోవాలనే విషయం ధోనీకి బాగా తెలుసు. ధోనీ సారథ్యంలో ఆడడం నాలాంటి వారికి గొప్ప గౌరవం. చాలామంది కల. ధోని మరిన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ దీపక్ చాహర్ ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.