కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అనే ప్రశ్నకు ఒవైసీ సమాధానం

కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అనే ప్రశ్నకు ఒవైసీ సమాధానం

Asaduddin Owaisi praises KCR
  • కేసీఆర్ గొప్ప దార్శనికుడు అన్న ఒవైసీ
  • కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెెందిందని కితాబు
  • మత్స్య సంపదలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని ప్రశంస
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నాయకుడు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కొనియాడారు. ఒవైసీ ప్రస్తుతం బీహార్ పర్యటనలో ఉన్నారు. కిసాన్ గంజ్ జిల్లాలో ఆయన మీడియాతో ముచ్చటిస్తుండగా... రానున్న లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ ప్రధాని రేస్ లో ఉన్నారా?  అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి సమాధానంగా కేసీఆర్ గొప్ప దార్శనికుడు అని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. 

తెలంగాణకు సముద్ర తీరం లేనప్పటికీ.... మెరుగైన రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో దూసుకుపోతోందని అన్నారు. మత్స్య సంపదలో రెండో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వ పటిమపై ప్రశంసలు కురిపించిన ఒవైసీ... ఆయన ప్రధాని రేసులో ఉన్నారా? లేదా? అనే విషయంపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు.
Advertisement
asadu
MIM
KCR
BRS

More Telugu News