హైదరాబాద్ లో షీ షటిల్ బస్సు.. మహిళలకు ఉచిత ప్రయాణం

Dgp started free She Shuttle services in hyderabad
  • బస్సును ప్రారంభించిన డీజీపీ అంజనీ కుమార్
  • రాయదుర్గంలో గ్రాండ్ గా ఉమెన్స్ కాంక్లేవ్ అవార్డుల కార్యక్రమం
  • డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల హాజరు
హైదరాబాద్ సిటీలో మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సును తయారుచేశారని తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారని వివరించారు. భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు కూడా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిధి కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్ సీ ఎస్ సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
She suttle
free bus
Hyderabad
women
bus survices
DGP

More Telugu News