నా మాటలు వక్రీకరించారు: రేవంత్ రెడ్డి
- సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారని రేవంత్ అన్నట్టుగా వార్తలు
- తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్న రేవంత్
- మీడియా సంయమనం పాటించాలని విన్నపం
కాంగ్రెస్ లో సీనియర్లు అమ్ముడుపోయారంటూ ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసిందని విమర్శించారు. తాను అనని మాటలను అన్నట్టుగా రాశారని దుయ్యబట్టారు. ఈ వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. వార్తలు రాసే విషయంలో మీడియా సంయమనం పాటించాలని అన్నారు. రాజకీయ వివాదాలను సృష్టించి సమస్యను జటిలం చేసే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.