లగేజ్ ఎక్కువుంటే ఫైన్.. ప్రయాణికులకు రైల్వే కొత్త రూల్స్
- ఫస్ట్ క్లాస్ ఏసీలో 70 కేజీల లగేజి వరకు అనుమతి
- సెకండ్ క్లాస్ లో 50 కేజీలు, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ లలో 40 కేజీలే
- పరిమితికి మించి లగేజీ తీసుకెళితే జరిమానా తప్పదని హెచ్చరిక
ఎవరెవరు ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చంటే..
- ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తమతో ఫ్రీగా తీసుకెళ్లవచ్చు.
- సెకండ్ క్లాస్ ఏసీలో 50 కిలోలు, థార్డ్ క్లాస్ ఏసీ స్లీపర్, ఏసీ చైర్ కార్ క్లాస్‌లలో 40 కిలోల వరకు లగేజీని ఉచితంగా వెంట తీసుకెళ్లవచ్చు.
- సెకండ్ క్లాస్‌లో 25 కిలోల లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ పరిమితి దాటితే రూ.30లు లగేజీ ఛార్జీ చెల్లించాలి.
- బుక్ చేసుకోకుండా అదనపు లగేజీతో ప్రయాణించే వారికి బ్యాగేజీ విలువకు ఆరు రెట్లు జరిమానా విధిస్తామని రైల్వే హెచ్చరించింది.