ఓవైపు గణేశుడు.. మరోవైపు ధోని ఫొటో! పెండ్లి పత్రికపై క్రికెటర్ ఫొటో ముద్రించిన కర్ణాటక ఫ్యాన్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆహ్వాన పత్రిక
- ఆదివారం (మార్చి 12న) జరగనున్న వివాహం
- హోమ్ ఆఫ్ ధోని ఫ్యాన్ అంటూ ఇంటికి పసుపు రంగు వేసుకున్న మరో అభిమాని
కార్డుపై మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో ఛాంపియన్స్ ట్రోఫీ 2013 నాటిదిగా తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించిన మిగతా వివరాలు తెలియరాలేదు. కర్ణాటక ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ ఫొటోను ట్వీట్ చేసింది. కాగా, తమిళనాడుకు చెందిన మరో అభిమాని తన ఇంటికి పసుపు రంగు వేయించాడు. ధోనిపై, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తన అభిమానాన్ని చాటుకునేలా ఇళ్లు మొత్తాన్ని పసుపు రంగుతో ముంచేశాడు. హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్ అని తన ఇంటికి పేరుపెట్టుకున్నాడు. తమిళనాడులోని అరంగుర్‌లో గోపీ కృష్ణన్, అతని కుటుంబం ఈ రకమైన ప్రేమను చూపించి వార్తల్లో నిలిచారు.