చిన్న సినిమాను చిన్నచూపు చూడొద్దు : దర్శకుడు మారుతి
- రొమాంటిక్ లవ్ స్టోరీగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'
- ఈ నెల 17వ తేదీన విడుదలవుతున్న సినిమా
- హైదరాబాదులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- నాగశౌర్య - మాళవిక జోడీ బాగుంటుందన్న మారుతి
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. దర్శకుడు మారుతి .. బాబీ .. బీవీఎస్ రవి .. అడివి శేష్ హాజరయ్యారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో .. హీరోయిన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ స్టేజ్ పై మారుతి మాట్లాడుతూ .. "నాగశౌర్య - మాళవిక జోడీ చాలా బాగుంటుంది. అలాగే నాగశౌర్య - అవసరాల కాంబినేషన్ కూడా బాగా కుదురుతుంది. ఈ మధ్య కాలంలో మంచి మంచి చిన్న సినిమాలను ఆడియన్స్ మిస్సవుతున్నారు. చిన్న సినిమాను చిన్నచూపు చూడొద్దు. థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది" అన్నారు.