Birth: హైదరాబాదులో నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం... ఎంఐఎంపై మండిపడిన రాజాసింగ్

  • జీహెచ్ఎంసీలో సరైన పత్రాలు లేకుండా సర్టిఫికెట్ల జారీ
  • ఎంఐఎం ప్రమేయం ఉందన్న రాజాసింగ్
  • పాతబస్తీలో 27 వేల నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని వెల్లడి
Birth and Death Certificates scam in Hyderabad

హైదరాబాదులో నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం వెలుగుచూడడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జీహెచ్ఎంసీ నకిలీ సర్టిఫికెట్ల దందాలో ఎంఐఎం పార్టీ ప్రమేయంపై నిగ్గు తేల్చాలని అన్నారు. పాతబస్తీలోనే ఇటువంటి బర్త్ సర్టిఫికెట్లు 27 వేల వరకు ఉన్నాయని, ఎంఐఎం నేతలు దగ్గరుండి ప్రోత్సహించారని ఆరోపించారు. 

ఈ నకిలీ సర్టిఫికెట్లు పొందినవారిలో పాకిస్థానీలు, బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారని, టెర్రరిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. 

బర్త్, డెత్ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు కూడా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో నిర్దేశిత ధ్రువపత్రాలు లేకుండానే 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయం సంచలనం సృష్టించింది.

More Telugu News