Rajasthan: రాజస్థాన్‌లో రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో వింత శిశువు జననం.. కాసేపటికే మృతి

  • చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లో ఘటన
  • పుట్టిన 20 నిమిషాలకే మృతి
  • క్రోమోజోముల లోపం వల్ల ఇలా జరుగుతుందన్న వైద్యులు
  • సకాలంలో సాధారణ ప్రసవం చేసిన వైద్యులు
  • ఆరోగ్యంగానే వున్న మహిళ
Boy Born With Four Arms And Four Legs in Rajasthan

రాజస్థాన్‌లో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన ఆ శిశువు పుట్టిన అరగంట లోపే మృతి చెందింది. చురు జిల్లా రతన్‌గఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. హజారీ సింగ్ అనే 19 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో ఆదివారం రాత్రి గంగారామ్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు నిర్వహించిన సోనోగ్రఫీలో శిశువు వింతగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. శిశువుకు రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు రెండు వెన్నెముకలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తల మాత్రం ఒకటే ఉందని, హృదయ స్పందనలు తక్కువగా ఉండడంతో పుట్టిన 20 నిమిషాలకే నవజాత శిశువు మృతి చెందినట్టు తెలిపారు. 

మహిళకు సాధారణ ప్రసవమే జరిగిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వింత శిశువు జననంపై డాక్టర్ రీటా సొంగరా మాట్లాడుతూ.. మహిళకు ఇతర ఆసుపత్రుల్లో చేసిన సోనోగ్రఫీ పరీక్షల్లో శిశువు సాధారణంగా ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయన్నారు. ఇంత కష్టమైన డెలివరీని నార్మల్‌గా చేయడం కష్టసాధ్యమైన పనేనని అన్నారు. అయితే, సకాలంలో సాధారణ ప్రసవం చేయడం వల్ల తల్లి ప్రాణాలు కాపాడగలిగినట్టు చెప్పారు. ఇలాంటి డెలివరీని ‘కంజుక్టివల్ అనోమలీ’ అంటారని తెలిపారు. క్రోమోజోముల వల్ల ఇలా జరుగుతుండొచ్చని డాక్టర్ అభిప్రాయపడ్డారు.

More Telugu News