సీతను తీసుకెళ్లాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు: ' రావణాసుర' టీజర్ డైలాగ్
- 'రావణాసుర'గా రవితేజ
- ఆయన సరసన ఐదుగురు హీరోయిన్లు
- కీలకమైన పాత్రలో సుశాంత్
- ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో హీరో తాను టార్గెట్ చేసినవారిని వరుసగా అంతం చేస్తూ వెళుతుంటాడు. ఆయన చంపే తీరు కూడా రాక్షసంగా ఉంటుంది. ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్స్ గా జయరామ్ - మురళీశర్మ కనిపిస్తున్నారు. హీరో ఎందుకు అలా మారాడనేది సస్పెన్స్.
'సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు .. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి' అనే హీరో డైలాగ్ ఈ టీజర్ కి హైలైట్. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. దక్ష నగార్కర్ . పూజిత పొన్నాడ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. సుశాంత్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.