ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: రామ్ చరణ్
- అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' చిత్ర ప్రదర్శన
- ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన రామ్ చరణ్
- అభిమానుల స్పందన ఎంతో సంతోషం కలిగించిందని వ్యాఖ్య
తాజాగా అమెరికాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఏస్ హోటల్ లో ప్రదర్శించిన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ప్రేక్షకులతో కలిసి రామ్ చరణ్ కూడా సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని చరణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అభిమానుల నుంచి వచ్చిన అమోఘమైన స్పందన.. స్టాండింగ్ ఒవేషన్ ను చూసి చాలా సంతోషం కలిగిందని చరణ్ చెప్పాడు. ఈ క్షణాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని తెలిపారు.