లిక్కర్ స్కాం కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్
- షరతులతో మంజూరు చేసిన సీబీఐ స్పెషల్ కోర్టు
- లక్ష రూపాయల బాండ్, ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశం
- అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని వార్నింగ్
నిందితులు తలా రూ. లక్ష పూచీకత్తు, ఒక ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు షరతు విధించింది. అనుమతిలేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడవద్దని ఆదేశించింది. అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. షరతులు అతిక్రమిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ 12 మందిని అరెస్ట్ చేశాయి. సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు ఏడుగురికి బెయిల్ లభించింది.