Naga Shourya: రోడ్డుపై అమ్మాయిని కొట్టిన యువకుడు... అడ్డుకున్న హీరో నాగశౌర్య

  • వీడియో వైరల్
  • నా లవర్ ను నేను కొడతా అంటూ యువకుడి వాదన
  • రోడ్డుమీద ఎందుకు కొట్టావ్ అంటూ నాగశౌర్య ఆగ్రహం
  • అమ్మాయికి సారీ చెప్పాలంటూ డిమాండ్
Naga Shourya stops youth who was beating his girl friend

సోషల్ మీడియాలో టాలీవుడ్ యువ హీరో నాగశౌర్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై ఒక యువకుడు గాళ్ ఫ్రెండ్ పై చేయి చేసుకోగా, అటుగా వెళుతున్న నాగశౌర్య తన కారు దిగివచ్చి ఆ యువకుడ్ని అడ్డుకోవడం వీడియోలో చూడొచ్చు. నా లవర్ ను నేను కొడతాను... అంటూ ఆ యువకుడు వాదించగా... రోడ్డుమీద ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్... సారీ చెప్పు అంటూ నాగశౌర్య ఆ యువకుడి చేయిపట్టుకుని నిలదీశాడు. అక్కడున్న వారు కూడా నాగశౌర్యకు మద్దతుగా యువకుడిపై ధ్వజమెత్తారు. లవర్ అయితే కొడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News