Team India: మూడో టెస్టు కోసం ముమ్మర సాధన చేస్తున్న టీమిండియా... ఫొటోలు ఇవిగో!

Team India cricketers sweats in nets for third test
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులను చేజిక్కించుకున్న టీమిండియా... మూడో టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. ఈ టెస్టు మ్యాచ్ రేపు (మార్చి 1) ఇండోర్ లో ప్రారంభం కానుంది. రెండో టెస్టు తర్వాత సుదీర్ఘ విరామం చిక్కడంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. 

మూడో టెస్టును డ్రా చేసుకున్నా చాలు... సిరీస్ టీమిండియా వశమవుతుంది. అయినప్పటికీ, భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో, ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో భారత ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
Go Back to Shorts
Team India
Australia
3rd Test
Indore

More Telugu News