ఇది లవ్ జిహాదీ కేసేనంటూ.. ప్రీతి ఘటనపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు
- కేసును చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్న సంజయ్
- ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్
- హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని ఆరోపణ
ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సంజయ్ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రీతిని అనేక సార్లు వేధింపులకు గురిచేశారని ఆమె తండ్రి చెప్పినా.. దీన్ని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.