Talasani: సమాజంలో మనుషులు ఎంత అవసరమో జంతువులు కూడా అంతే అవసరం: మంత్రి తలసాని

Talasani says there is a need for animals in the society as well as humans
  • ఇటీవల హైదరాబాదులో బాలుడిపై కుక్కల దాడి
  • మృతి చెందిన చిన్నారి
  • ఎవరో సలహాలు ఇస్తే తీసుకోబోమన్న తలసాని
  • తాము ఎప్పటినుంచో చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి 
ఇటీవల హైదరాబాదులోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బాలుడి మృతి ఘటనతోనే తమ ప్రభుత్వం అలెర్ట్ కాదని, తాము ఎప్పటినుంచో వీధికుక్కల అంశంపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

మేయర్ వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో మనుషులు ఎంత అవసరమో, జంతువులు కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. బాలుడి మృతి ఘటన ఏ విధంగా చూసినా బాధాకరమేనని తలసాని అభిప్రాయపడ్డారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. 

ఈ ఘటన నేపథ్యంలో ఎవరో విమర్శలు చేస్తూ సలహాలు ఇస్తే తాము తీసుకోబోమని, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుసని స్పష్టం చేశారు. నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. 

అయితే, ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తలసాని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.
Talasani
Stray Dogs
Boy
Death
Hyderabad
BRS
Telangana

More Telugu News