Amani: మెగాస్టార్ జోడీగా ఆ సినిమాను నేను చేయవలసింది: నటి ఆమని

Amani Interview

  • అభినయ ప్రధానమైన పాత్రలను చేసిన ఆమని
  • 'రిక్షావోడు' ఛాన్స్ చేజారిందని వివరణ  
  • ఆ సమయంలో సౌందర్య అభినందించిందని వెల్లడి 
  • వెంకటేశ్ తోనూ చేయలేకపోయానని అసంతృప్తి   

నటన ప్రధానమైన కథలను .. మధ్యతరగతి గృహిణి పాత్రలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడంలో ఆమని మంచి మార్కులను కొట్టేశారు. ఉత్తమనటిగా అవార్డులను అందుకున్నారు. 'శుభలగ్నం' వంటి సినిమాలు అసమానమైన ఆమె నటనకు అద్దం పడుతూ ఉంటాయి. అలాంటి ఆమని తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సరసన నటిస్తే చాలునని అనుకున్నాను. 'రిక్షావోడు' సినిమాలో ఆయన సరసన నన్ను .. సౌందర్యను ఎంచుకున్నారు. ఆ తరువాత ఆ సినిమాకి డైరెక్టర్ మారారు. అప్పుడు నా ప్లేస్ లో నగ్మా ఎంట్రీ ఇచ్చారు. అలా ఆయన జోడీగా నటించే అవకాశాన్ని కోల్పోయాను" అన్నారు.

'చిరంజీవిగారితో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు నా స్నేహితురాలిగా సౌందర్య సంతోషపడింది. కానీ ఆ తరువాత ఆ అవకాశం చేజారినప్పుడు చాలా బాధపడ్డాను. మెగాస్టార్ తో చేయాలనే ఆ కోరిక అలాగే ఉండిపోయింది. వెంకటేశ్ జోడీగా కూడా చేయలేకపోయాను' అంటూ చెప్పుకొచ్చారు. 

Amani
Soundarya
Chiranjevi
Rikshavodu Movie
  • Loading...

More Telugu News