Boy: బాలుడిపై కుక్కల దాడి ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

Telangana high court takes up boy death of stray dogs attack as Suo Moto
  • కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో బాలుడి మృతి
  • మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు హైకోర్టు వెల్లడి
  • జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించిన న్యాయస్థానం  
హైదరాబాదు నగరంలో కొన్నిరోజుల కిందట వీధి కుక్కలు ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కాగా ఈ ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మీడియా కథనాల ఆధారంగా విచారణకు తీసుకుంటున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. వీధి కుక్కల అంశంలో జీహెచ్ఎంసీ ఏంచేస్తోందని ప్రశ్నించింది. 

ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది. వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అంబర్ పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది. బాలుడి మృతి బాధాకరమని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
Boy
Stray Dogs
Death
Suo Moto
High Court
Hyderabad
Telangana

More Telugu News